![]() |
![]() |

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్‌కి వెళ్ళాలని అనుకుంటున్నాడు. సుకుమార్ డైరెక్షన్‌లో చేస్తున్న ‘పుష్ప’ను హిందీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాడు. అలాగే, ఇప్పటినుండి బాలీవుడ్ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. టైమ్ కుదిరినప్పుడు బాలీవుడ్ స్టార్స్, సినిమాల గురించి మాట్లాడుతున్నాడు.
‘‘బాలీవుడ్‌లో నాకు నచ్చిన టాప్3 ఆల్‌టైమ్ ఫేవరెట్ సినిమాలు పిక్ చేయాలంటే... ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’, ‘హమ్ ఆప్ కే హై కౌన్’, ‘కరణ్ అర్జున్’ ఉంటాయి’’ అని అల్లు అర్జున్ చెప్పాడు. అందులో ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ షారుక్ ఖాన్ సినిమాల్లో ఆల్‌టైమ్ క్లాసిక్. అలా, బాద్షా అభిమానులు మెప్పించాడు. ‘హమ్ ఆప్ కే హై కౌన్’ సల్మాన్ సినిమా. అలా కండలవీరుడి ఫ్యాన్స్‌కి కవర్ చేశాడు. షారుక్, సల్మాన్ నటించిన ‘కరణ్ అర్జున్’తో తనకు నచ్చిన మరో సినిమా అన్నాడు.
బాలీవుడ్ హీరోలలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తనకు ఇష్టమని బన్నీ చెప్పుకొచ్చాడు. అమితాబ్ సినిమాలలో ‘జంజీర్’ తన ఫేవరెట్ అన్నాడు. బాలీవుడ్ ఎంట్రీకి ముందు అందరి అభిమానులకు ఎట్రాక్ట్ చేసే ట్రైల్స్‌లో అల్లు అర్జున్ ఉన్నాడు.
![]() |
![]() |