![]() |
![]() |

స్టార్ మా ఛానల్ నుండి అఫీషియల్‌గా టీజర్ వచ్చింది. "ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న సమయం రానే వస్తోంది. త్వరలో స్టార్ మాలో బిగ్ బాస్ తెలుగు4 స్టార్ట్ అవుతుంది" అని ఒక చిన్న వీడియో విడుదల చేశారు. మొదట ఆగస్టులో షో స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ, ప్రస్తుతం స్టార్ మా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ నెలలో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట.
కింగ్ అక్కినేని నాగార్జున 'బిగ్ బాస్ తెలుగు 4'కి హోస్ట్ చేయనున్నారు. అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ స్టూడియోలో బిగ్ బాస్ 4 హౌస్ రెడీ చేస్తున్నారు. లాస్ట్ సీజన్ సెట్ కంటే ఈ సీజన్ హౌస్ సెట్ మరింత అట్రాక్టివ్ గా ఉండేలా చూస్తున్నారు. షో ఫార్మట్‌లో కూడా మార్పులు చేయవచ్చని తెలుస్తోంది.
ఆల్రెడీ హౌస్‌లోకి ఎవరిని పంపించాలని స్టార్ మా డిస్కషన్లు మొదలుపెట్టింది. కొంతమంది క్రేజీ స్టార్స్ కి గాలం వేస్తోంది. కరోనా నేపథ్యంలో ప్రజలు ఎక్కువశాతం మంది ఇళ్లకు పరిమితం అవుతున్నారు. అందుకని, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. కేవలం కామెడీ మాత్రమే కాకుండా, థ్రిల్ సస్పెన్సు ఇచ్చే విధంగా డిజైన్ చేయాలని అనుకుంటున్నారట.
![]() |
![]() |