![]() |
![]() |

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును తన వివాహ వేడుకకు రావాల్సిందిగా హీరో నితిన్ ఆహ్వానించాడు. ప్రగతి భవన్లో సోమవారం తండ్రి సుధాకర్‌రెడ్డితో కలిసి కేసీఆర్‌ను కలిశాడు నితిన్. అతనికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్. జూలై 26న రాత్రి 8:30 గంటలకు తన దీర్ఘకాల ప్రేయసి షాలిని మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు నితిన్. ఒక విలాసవంతమైన హోటల్లో వారి వివాహ వేడుక జరగనున్నది. ప్రభుత్వం విధించిన కొవిడ్-19 నియమ నిబంధనల మేరకు రెండు కుటుంబాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
నిజానికి ఏప్రిల్‌లో దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకున్న ఆ జంట పెళ్లి.. లాక్డౌన్ కారణంగా వాయిదాపడింది. ఎట్టకేలకు ఇప్పుడు వారు ఒక్కటి కాబోతున్నారు. ప్రస్తుతం నితిన్ 'రంగ్ దే', 'చెక్' సినిమాలు చేస్తున్నాడు. అవి పూర్తయిన వెంటనే 'అంధాధున్' రీమేక్, 'పవర్ పేట' సినిమాలను చేయనున్నాడు.
![]() |
![]() |