![]() |
![]() |

కరోనా టైమ్స్‌లో అందరి కంటే బిజీగా ఉంటున్న వ్యక్తి రామ్‌గోపాల్ వర్మ. వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలు అనౌన్స్ చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే 'క్లైమాక్స్', 'నగ్నం' అనే నిడివి తక్కు వ చిత్రాలు తీసి కొత్తగా తను స్టార్ట్ చేసిన ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అనే ఏటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చేసి డబ్బు గడించారు. దాంతో పాటు శ్రేయాస్ ఈటీ అనే మరో ఏటీటీ ప్లాట్‌ఫామ్‌పై కూడా రిలీజ్ చేశారు. వర్మ తీసే కొత్త సినిమాలు కూడా ఆ ప్లాట్‌ఫామ్‌పై విడుదల కానున్నాయి.. కాకపోతే ఒక్క సినిమా తప్ప! ఆ సినిమా 'పవర్‌స్టార్'!!. అవును. 'పవర్‌స్టార్' మూవీని శ్రేయాస్ ఈటీపై రిలీజ్ చేయట్లేదు. కారణం.. ఆ సంస్థ అల్లు అరవింద్‌కు సన్నిహితులది కావడం. అందువల్ల 'పవర్‌స్టార్' జోలికి వెళ్లొద్దంటూ శ్రేయాస్ వాళ్లకు వచ్చిన సూచనలతో వాళ్లు ఆ మూవీని వదులుకున్నారు.
తాజాగా ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌కు హ్యాకర్స్ ముప్పు ఉందంటూ ఒక పోర్టల్‌లో వచ్చిన కథనం చర్చనీయాంశమైంది. ఆ కథనం ప్రకారం గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఒక పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగానికి సన్నిహితంగా మెలిగిన ఒక పేరున్న నిర్మాత ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌పై సైబర్ ఎటాక్ చేయడానికి విదేశాల నుంచి కొంతమంది హ్యాకర్లను వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇది చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమని ఆ నిర్మాతకు తెలిసినట్లు లేదనీ, చట్టపరంగా ఇది సీరియస్ కేస్ అనీ, దొరికితే కటకటాల వెనక్కి వెళ్లాల్సి వస్తుందనీ కూడా ఆ కథనంలో హెచ్చరించారు.
ఆర్జీవీ 'పవర్‌స్టార్' సినిమా పవన్ కల్యాణ్‌కు సంబంధించినదని అందరికీ తెలిసిందే. అందువల్ల ఆయనకు సన్నిహితంగా ఉంటున్న నిర్మాతే ఈ పనికి పూనుకుంటున్నట్లుగా ఆ కథనం బట్టి తెలుస్తోంది. కానీ ఆ నిర్మాత పేరును వాళ్లు వెల్లడించలేదు. ఇంతకీ ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌ను హ్యాక్ చెయ్యాలనుకుంటున్న ఆ నిర్మాత ఎవరబ్బా!!

![]() |
![]() |