![]() |
![]() |

పూనం కౌర్ ఏ మాత్రం తగ్గడం లేదు. గంట గంటకు తన మాటల్లో పదును పెంచుతోంది. దర్శకుడిపై విరుచుకు పడుతోంది. గురూజీ అని సంబోధిస్తూ పరోక్షంగా త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్ల బాణాలు వదులుతోంది. ఇప్పుడు ఏకంగా త్రివిక్రమ్ వల్లే పవన్ కళ్యాణ్ జీవితం పాడైందని... ఎప్పటిలా త్రివిక్రమ్ పేరు ప్రస్తావించకుండా ట్వీట్ చేసింది.
న్యాయం కోసం చట్టపరంగా పోరాటం చేయాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ ఫోటో డిపిగా పెట్టుకున్న ఒక నెటిజన్ సలహా ఇవ్వగా.... "మీ అన్న (పవన్ కళ్యాణ్) చెప్పారా? ఆయన ఓడిపోవడం మీకు సంతోషంగా ఉందా? ఆయన అవమానాల పాలు కావడం మీకు ఆనందంగా ఉందా? చెప్పండి?? మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అనే ప్రతి ఒక్కరు విమర్శిస్తుంటే మీకు సంతోషమేనా??? ఈ సన్నాసి వల్లే మీ అన్న జీవితం పాడైందని మీకు తెలియాలి.. నమస్తే" అని పూనం కౌర్ బదులిచ్చారు. అగ్ర దర్శకుడిపై తాను ఆరోపణలు చేయడం లేదని... పచ్చి నిజాలు చెబుతున్నానని ఆమె పేర్కొన్నారు.
![]() |
![]() |