![]() |
![]() |

మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె, మెగా ప్రిన్స్ నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని, ఏడు అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. పెళ్లి విషయంలో నిహారిక సైతం ఇన్-డైరెక్ట్ హింట్ ఇచ్చారు. 'మిస్' నిహా అని రాసి ఉన్న కాఫీ కప్ మీద 'మిస్' కొట్టేసి 'మిసెస్' అని రాశారు. అసలు విషయం ఏంటంటే... నిహారిక పెళ్లిపై మెగా ఫ్యామిలీ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారట. ఆల్రెడీ పెళ్లి కొడుకును కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది. గతంలో నాగశౌర్యతో నిహారిక ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. తర్వాత ప్రభాస్ కి ఇచ్చి పెళ్లి చేస్తున్నారని పుకార్లు షికార్లు చేశాయి. మధ్యలో నిహారికకు వరుసకు బావ అయ్యే సాయి ధరమ్ తేజ్ పేరు కూడా వినిపించింది. అయితే, మెగా ఫ్యామిలీకి అల్లుడు కాబోయేది వీళ్లలో ఒకరు కాదు.

ఏపీకి చెందిన ఓ ఐఏఎస్ కుమారుడితో నిహారిక వివాహం నిశ్చయించినట్టు సమాచారం. అబ్బాయి పేరు చైతన్య అట. ఎంబిఎ చేశాడని, ప్రస్తుతం ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని టాక్. ఆదివారం మెగా ఫ్యామిలీ, ఐఏఎస్ ఫ్యామిలీ మధ్య పెళ్లి చర్చలు జరిగాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది పెళ్లి చేయాలని అనుకుంటున్నారట.
![]() |
![]() |