![]() |
![]() |

కథానాయికగా కేరళ కుట్టి కీర్తి సురేష్‌ది పదహారు సినిమాల ప్రాయం. 2013లో విడుదలైన మలయాళ చిత్రం 'గీతాంజలి'తో కెరీర్‌ని ప్రారంభించిన కీర్తి.. రెండేళ్ల క్రితం విడుదలైన 'సర్కార్'తో హీరోయిన్‌గా 16 చిత్రాలు పూర్తి చేసింది. ఈ ప్రయాణంలో ఒకవైపు అగ్ర కథానాయకులతోనూ, మరోవైపు యువ కథానాయకులతోనూ జోడికట్టి మురిపించింది. అలాగే.. ఫీమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్‌లోనూ సందడి చేసింది. నాయికగా తను నటించిన తొలి చిత్రం 'గీతాంజలి'నే ఆ తరహా చిత్రం కావడం విశేషం. మళ్ళీ ఐదేళ్ళ తరువాత 'మహానటి' రూపంలో మరో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ చేసింది కీర్తి.
‘మహానటి’ ఘనవిజయంతో క్రమంగా ఈ తరహా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది కీర్తి. ప్రస్తుతం కీర్తి చేతిలో ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’, 'గుడ్ లక్ సఖి' వంటి ఫీమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్ ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. వీటిలో విడుదలకు సిద్ధమైన కీర్తి రెండు చిత్రాలు కూడా కొత్త దర్శకుల కాంబినేషన్‌లో రూపొందిన సినిమాలు కావడం విశేషం. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కిన త్రిభాషా చిత్రం ‘పెంగ్విన్’ని డెబ్యూ డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ తీర్చిదిద్దగా.. మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మిస్ ఇండియా’ని నూతన దర్శకుడు నరేంద్ర రూపొందించాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ రెండు సినిమాలు కూడా ప్రయోగాత్మక కథలతోనే తెరకెక్కాయి. మరి కొత్త దర్శకులతో కీర్తి చేస్తున్న ఈ ప్రయోగాలు ఆమె కెరీర్‌కి ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.
కాగా ‘పెంగ్విన్’ ఈనెల 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో వరల్డ్ ప్రీమియర్‌గా రిలీజ్ కాబోతోంది. ఇక ‘మిస్ ఇండియా’ విషయానికొస్తే ఈ సినిమా కూడా ఓటీటీ రిలీజ్‌గా సందడి చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
![]() |
![]() |