![]() |
![]() |

కరోనా కాటుకు వెండితెర పరిశ్రమ విపరీతంగా నష్టపోయింది. వందల కోట్ల టర్నోవర్ ఆగిపోయింది. థియేటర్లు మూతపడి, ఎక్కడి చిత్రీకరణలు అక్కడే నిలిచిపోయి ఇబ్బందుల్లో పడింది. లాక్ డౌన్ నిబంధనలు సడలించి, పరిమిత బృందంతో చిత్రీకరణలు చేసుకోవడానికి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా... తెలుగు సినిమా పరిశ్రమలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. షూటింగ్లో ప్రారంభించడానికి మీన మేషాలు లెక్కిస్తున్నారు. కరోనా ప్రభావం వెండితెర తో పాటు బుల్లితెర పైనా పడింది. అయితే... బుల్లితెర ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. గాడిలో పడుతున్నట్టు అనిపిస్తోంది.
పరిమిత బృందంతో చిత్రీకరణలు చేయటానికి బుల్లితెరకు పెద్దగా ఇబ్బంది లేదు. సీరియళ్ళు, కామెడీ ప్రోగ్రాములు, రియాలిటీ షోలు... 50 మంది కంటే తక్కువ సంఖ్యలో నటీనటులు, సాంకేతిక నిపుణులతో షూటింగులు చేయవచ్చు. ఆల్రెడీ చాలా మంది షూటింగ్ లో స్టార్ట్ చేశారు. రామోజీ ఫిలింసిటీలో ఈటీవీ సీరియల్ షూటింగ్ లు జరుగుతున్నాయి. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. యాంకర్లు రవి, భాను శ్రీ, విష్ణుప్రియ, సుడిగాలి సుధీర్ తదితరులు షూటింగ్స్ చేస్తున్నారు. జబర్దస్త్ యాంకర్ రష్మి విశాఖ నుండి హైదరాబాద్ విమానంలో వచ్చింది. ప్రస్తుతం టీవీ ఇండస్ట్రీలో కదలిక కనపడుతోంది. కొన్ని రోజుల్లో పూర్వ వైభవానికి రావచ్చు.
![]() |
![]() |