![]() |
![]() |

"అర్హలూ.. నా బుజ్జితల్లులూ.. నువ్వు నా బంగారుతల్లి.. నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా?"
"ఉహూ.."
"ఆ.. ఏంటి చేసుకుంటావా, చేసుకోవా?"
"చేసుకోను.."
"యాయ్.. నిన్నూ.."
తండ్రికి అందకుండా అర్హ తుర్రుమని పరిగెత్తింది.
ఇది ఆన్‌లైన్‌లో వైరల్ అయిన వీడియో. దీన్ని షేర్ చేసింది అల్లు అర్జున్. లాక్‌డౌన్ పీరియడ్‌లో భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హలతో క్వాలిటీ టైమ్ గడుపుతున్నాడు అల్లు అర్జున్. సుదీర్ఘ కాలం గుర్తుండిపోయే జ్ఞాపకాల్ని ఈ సందర్భంగా అతను క్రియేట్ చేస్తున్నాడు. అందులో భాగమే.. శుక్రవారం అతను షేర్ చేసిన ఈ వీడియో. తండ్రి అడిగినదానికి చేసుకోను అని స్పష్టంగా చెప్పేస్తోంది అర్హం. తండ్రి పట్టుకోబోతుంటే, అతడికి చిక్కకుండా అక్కడ్నుంచి పారిపోయింది.
ఇలా కూతుర్ని అడగడం బన్నీకి ఇదే తొలిసారి కాదు. 374వ సారి. అందుకే ఈ వీడియోకు అంటెప్ట్ నంబర్ 374 అనే పేరు పెట్టాడు బన్నీ. అంటే తను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? అని కూతురు అర్హను 374వ సారి అడిగి, భంగపడ్డాడు బన్నీ. తండ్రి ఎన్నిసార్లు అడిగినా, ఒకే మాటపై నిలబడిందన్న మాట అర్హ. వెనక్కి వెళ్తే.. 2019 ఫిబ్రవరిలో ఇదే ప్రశ్న అర్హకు వేశాడు. అప్పుడూ ఇదే జవాబిచ్చింది అర్హ. ఆ విడీయో మిలియన్ మంది హృదయాల్ని గెలిచింది. ఇప్పుడు అర్హకు నాలుగేళ్లు. అప్పట్నుంచీ ఒకే మాటపై నిలబడటం చిన్న విషయం కాదు కదా.. దటీజ్ అర్హ!!
![]() |
![]() |