![]() |
![]() |

టాలీవుడ్‌లోని పాపులర్ స్టార్ కిడ్స్‌లో మహేశ్‌బాబు కూతురు సితార ఒకతె. తన ముచ్చటైన ఫొటోలు, వీడియోలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది సితార. అయితే ఈసారి తన వీడియోతో అందర్నీ భయపెట్టి, ఆ తర్వాత నవ్వించింది. అవును. సితార భయానకంగా కనిపించిన ఒక వీడియోను ఆమె తల్లి నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. దాన్ని చూసిన వాళ్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఆ వీడియోలో జుట్టును ముఖం మీదకు విరబోసుకొని సినిమాల్లో చూపించే దెయ్యం తరహాలో ఇంట్లో నడుచుకుంటూ వెళ్లిన సితార కనిపిస్తోంది. అందర్నీ భయపెట్టాలని సితార అనుకున్నప్పటికీ, ఆ రూపంలోనూ సితార ముద్దొస్తుందని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ వీడియోను షేర్ చేసి, "Conjuring in the house ..Voila !! It's only my little brat.. #spookytime." అని పోస్ట్ చేసింది నమ్రత.
ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో గౌతమ్, సితార.. ఇద్దరూ ఇండోర్ గేమ్స్ ఆడుతూ, స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తుంటే, వాళ్లతో పాటు మహేశ్, నమ్రత కూడా చిన్న పిల్లలై ఆడుకుంటున్నారు. ఏడేళ్ల సితార ఇప్పటికే సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయి, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలోని తన వీడియోలతో లక్షలాది మందిని అలరిస్తోంది. ఇటీవల అమ్మ నమ్రత కోసం మేనిక్యూరిస్ట్‌గా మారడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడం చూశాం.
![]() |
![]() |