![]() |
![]() |

భాగ్యశ్రీ.. 30 ఏళ్ల క్రితం భారతీయ కుర్రకారుకి కునుకు లేకుండా చేసిన అందం. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కెరీర్‌ని మలుపు తిప్పిన 'మైనే ప్యార్ కియా'(1989)తో కథానాయికగా తొలి అడుగేసింది భాగ్యశ్రీ. మొదటి ప్రయత్నంలోనే బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ‘ఉత్తమ నూతన నటి’గా ‘ఫిల్మ్ ఫేర్’ అవార్డును కూడా సొంతం చేసుకుంది. అయితే ఆ తరువాత మాత్రం ఆ స్థాయి విజయాన్ని కాదు కదా.. కనీసం జస్ట్ 'హిట్' రేంజ్ మూవీని కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. కేవలం హిందీ చిత్రాలకే పరిమితం కాకుండా కన్నడ, తమిళం, తెలుగు, బెంగాలీ, భోజ్‌పురి, మరాఠీ భాషల్లోనూ నటించింది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.
తెలుగులో ‘ఓంకారం’(1997), ‘యువరత్న రాణా’(1998), ‘అవునా’(2003).. ఇలా ఇప్పటికే మూడు చిత్రాల్లో నటించిన భాగ్యశ్రీకి మూడుసార్లూ చేదు అనుభవమే ఎదురైంది. అంతేకాదు.. ‘ఓంకారం’ కథానాయకుడు రాజశేఖర్ తనయ శివానిని నాయికగా పరిచయం చేస్తూ హిందీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘టూ స్టేట్స్’ని అదే పేరుతో రీమేక్ చేయగా.. అందులో శివానికి తల్లిగా భాగ్యశ్రీని ఎంపిక చేశారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా ఆగిపోయింది. దీంతో.. భాగ్యశ్రీ తెలుగు సినిమా చేస్తుందంటే భయపడే పరిస్థితి వచ్చింది.
ఇలాంటి నేపథ్యంలో.. మరో తెలుగు చిత్రంలో నటించే అవకాశం అందిపుచ్చుకుంది భాగ్యశ్రీ. ఈసారి ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. పిరియడ్ రొమాంటిక్ సాగాగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో ప్రభాస్‌కి అమ్మగా భాగ్యశ్రీ కనిపించనుందని సమాచారం.
మరి.. 30 ఏళ్లుగా సాలిడ్ హిట్ కోసం నిరీక్షిస్తున్న భాగ్యశ్రీకి.. ‘ప్రభాస్ 20’ అయినా కలిసొస్తుందేమో చూడాలి.
![]() |
![]() |