![]() |
![]() |

'ఆచార్య' మూవీ అప్‌డేట్స్ గురించి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఆత్యంతాసక్తితో ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జూన్ 15 నుంచి ఈ సినిమా షూటింగ్ కొనసాగిస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు సినిమా బడ్జెట్‌ను తగ్గిస్తున్నారంటూ ఆన్‌లైన్‌లో ప్రచారం జోరుగా నడుస్తోంది. బడ్జెట్ కనుక తగ్గించుకోనట్లయితే భారీ నష్టాలు తప్పవనీ, బయ్యర్లు ఇదివరకటిలా భారీ రేట్లు పెట్టి సినిమాను కొనే అవకాశం లేదనేది దాని సారాంశం. ఇప్పటివరకూ 'ఆచార్య'కు సంబంధించిన డైరెక్టర్ కొరటాల శివ 40 శాతం షూటింగ్ పూర్తి చేశాడు. మిగతా సన్నివేశాలను వీలైనంత తక్కువ బడ్జెట్‌తో తియ్యాల్సిందిగా అతడికి చిరంజీవి సూచించినట్లు కూడా ఆ ప్రచారంలో భాగంగా చెబుతున్నారు.
అయితే ఇప్పటివరకూ బడ్జెట్ విషయం కొరటాలతో చిరంజీవి కానీ, నిర్మాత రామ్‌చరణ్ కానీ ప్రస్తావించలేదని తెలిసింది. కాకపోతే వీలైనంత తక్కువ కాలంలో సినిమాని పూర్తి చేయాలని మాత్రమే చిరంజీవి సూచింనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదివరకు వేసుకున్న షెడ్యూల్స్ అన్నీ కాన్సిల్ కావడంతో, కొత్త షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. దీని ప్రకారం 'ఆచార్య' షూటింగ్ వర్కింగ్ డేస్ తగ్గనున్నాయి. ఆ మేరకు బడ్జెట్ కూడా కొంతమేరకు తగ్గనుంది. యాక్షన్ సీన్ల కోసం ఇదివరకు కేటాయించిన బడ్జెట్‌లో ఎలాంటి కోత విధించలేదు. వాటిలో చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి చేసే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉంది. ఆ యాక్షన్ సీన్ రోమాలు నిక్కబొడుచుకొనే రీతిలో ఉంటుందని సమాచారం. ఇది తండ్రీ కొడుకులు కలిసి చేస్తున్న మూడో సినిమా కావడం గమనార్హం. ఇదివరకు 'మగధీర', 'బ్రూస్‌లీ' సినిమాల్లో చిరంజీవి అతిథి పాత్రలు చేసిన విషయం తెలిసిందే. 'ఆచార్య' మూవీలో 25 నిమిషాలు పైగా ఉండే స్పెషల్ రోల్‌ను చరణ్ చేస్తున్నాడు.
కాగా చిరంజీవి, హీరోయిన్ కాజల్ అగర్వాల్ మధ్య రొమాంటిక్ సీన్లు, డ్యూయెట్ల చిత్రీకరణను వాయిదా వేశారు. సోషల్ డిస్టాన్సింగ్ నిబంధనలకు అనుగుణంగా ఉండే సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిరంజీవి బృందం రెడీ అవుతోంది.
![]() |
![]() |