![]() |
![]() |

రామానంద్ సాగర్ రూపొందించిన 'రామాయణ్' హిందీ టీవీ సీరియల్ మరోసారి వీక్షకుల్ని అలరిస్తోంది. లాక్‌డౌన్ పీరియడ్‌లో రన్నింగ్‌లో ఉన్న సీరియళ్ల షూటింగ్‌లు ఆగిపోవడంతో పాత సీరియల్స్‌ను, షోలను ప్రసారం చేస్తున్నాయి టీవీ చానళ్లు. అందులో భాగంగా 'రామాయణ్' సీరియల్ కూడా మళ్లీ వస్తోంది. మిగతా పాత సీరియళ్లతో పోలిస్తే దీని వ్యూయర్‌షిప్ అధికంగా ఉంది.
'రామాయణ్' సీరియల్‌తో ఆనాటి వీక్షకులకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. వాళ్లంతా మరోసారి వాటిని గుర్తు చేసుకుంటుంటే, నేటి తరం కూడా వారికి తోడుగా ఆ సీరియల్‌ను వీక్షిస్తుండటం విశేషం. సీతారాములుగా అరుణ్ గోవిల్, దీపికా చికిలియా భాషాతీతంగా అందరికీ ఆత్మీయులైపోయారు. అలాంటి సీరియల్ ఇప్పుడు తెలుగు ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి వచ్చేస్తోంది. అవును. 'రామాయణ్'' తెలుగు డబ్బింగ్ వెర్షన్ జూన్ 15న సోమవారం స్టార్ మా చానల్‌లో ప్రారంభం కానున్నది. వారాంతాలు మినహా మిగతా రోజుల్లో సాయంత్రం 5.30 గంటలకు ఈ సీరియల్‌ను ప్రసారం చేస్తున్నట్లు చానల్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.
"The classic tale of #Ramayanam by Ramanand Sagar...Starting this June 15th, Mon-Fri at 5:30 PM on @StarMaa. అని షో నిర్వాహకులు ట్వీట్ చేశారు. తెలుగులోనే కాకుండా, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ 'రామాయణ్'ను అనువాదం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో వ్యూయర్‌షిప్ పరంగా ఎన్నో రికార్డుల్ని బద్దలు కొట్టి, ప్రపంచంలోనే అత్యధికులు వీక్షించిన టీవీ సీరియల్స్‌లో ఒకటిగా పేరు తెచ్చుకున్న 'రామాయణ్'ను తెలుగు ప్రేక్షకులు ఆస్వాదించడమే తరువాయి.
![]() |
![]() |