![]() |
![]() |

ఈ మధ్య కాలంలో ఏ సినిమాపై రానంతగా ట్రోల్స్ 'సన్ ఆఫ్ ఇండియా'పై వచ్చాయి. డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రధానపాత్ర పోషించిన ఈ సినిమాకి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించాడు. అంతగా అంచనాలు లేకుండా ఫిబ్రవరి 18న విడుదలైన ఈ సినిమా దారుణ ఫలితాన్ని చూసింది. ఏకపాత్రాభినయం ప్రయోగం బెడిసి కొట్టడమే కాకుండా ఈ సినిమాపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. థియేటర్స్ లో మంచు ఫ్యాన్స్ ఆదరణకి కూడా ఈ సినిమా నోచుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది.
ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో నేటి నుంచి 'సన్ ఆఫ్ ఇండియా' స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో ఈ సినిమాకి నెగటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. మోహన్ బాబు తనదైన శైలిలో డైలాగ్స్, యాక్టింగ్ తో అదరగొట్టాడన్న అభిప్రాయం వ్యక్తమైంది. అలాగే స్టోరీ కాన్సెప్ట్ తో పాటు ప్రయోగం చేయాలన్న ఆలోచన బాగున్నా.. దానిని ప్రజెంట్ చేసిన విధానం బాగాలేదని పలువురు అభిప్రాయపడ్డారు. మరి థియేటర్స్ లో అలరించలేకపోయిన ఈ మూవీ.. ఓటీటీలో అయినా సత్తా చాటుతుందేమో చూడాలి.
మంచు విష్ణు నిర్మించిన 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. అలాగే ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించడం అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు.
![]() |
![]() |