![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ కార్తి కెరీర్ లో ఎంతో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో `ఖైదీ` (2019) ఒకటి. కథానాయిక, పాటలు లేకుండా దర్శకుడు లోకేశ్ కనకరాజ్ తీసిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. అటు తమిళ ప్రేక్షకులనే కాదు ఇటు తెలుగువారిని కూడా విశేషంగా ఆకట్టుకుంది. కట్ చేస్తే.. త్వరలో ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ రానుందని సమాచారం.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో కార్తితో పాటు అతని అన్న, వెర్సటైల్ స్టార్ సూర్య కూడా నటించబోతున్నాడట. సూర్యది అభినయానికి ఆస్కారమున్న పాత్ర కావడంతో పాటు కార్తి కాంబినేషన్ లోనూ కొన్ని సీన్స్ ఉంటాయని చెప్పుకుంటున్నారు. అదే గనుక నిజమైతే.. కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తి అభిమానులకు ఇది ఆనందాన్నిచ్చే అంశమనే చెప్పాలి. త్వరలోనే `ఖైదీ` సీక్వెల్, అందులో సూర్య రోల్ పై ఫుల్ క్లారిటీ రానున్నది.
కాగా, లోకేశ్ కనకరాజ్ తాజా చిత్రం `విక్రమ్`లోనూ సూర్య అతిథి పాత్రలో దర్శనమివ్వనున్నాడు. లోక నాయకుడు కమల్ హాసన్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. జూన్ 3న ఈ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ కానుంది.
![]() |
![]() |