![]() |
![]() |

`భరత్ అనే నేను`, `మహర్షి`, `సరిలేరు నీకెవ్వరు` చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. రీసెంట్ గా `సర్కారు వారి పాట`తో సందడి చేశారు. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ ముంగిట మాత్రం మంచి వసూళ్ళనే రాబడుతోంది.
ఇదిలా ఉంటే, `సర్కారు వారి పాట` అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన కొత్త చిత్రం (`#SSMB28`) చేయనున్నారు మహేశ్ బాబు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇందులో మహేశ్ బాబుకి జోడీగా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే నటించనుండగా.. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నాడు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని మహేశ్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న రివీల్ చేయనున్నారట.
.webp)
మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. కాగా, వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుందని టాక్. `అతడు`, `ఖలేజా` వంటి క్లాసిక్స్ తరువాత మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో రానున్న సినిమా కావడంతో.. `#SSMB28`పై మంచి అంచనాలే ఉన్నాయి.
![]() |
![]() |