![]() |
![]() |
.webp)
యువ కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్.. `గ్యాంగ్ లీడర్`, `శ్రీకారం` చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే, ఈ రెండు సినిమాలు కూడా ప్రియాంకకి ఆశించిన విజయాన్ని అందివ్వలేకపోయాయి. దీంతో, కోలీవుడ్ లో పాగా వేసింది ఈ హోమ్లీ బ్యూటీ.
ఈ క్రమంలోనే.. యంగ్ హీరో శివ కార్తికేయన్ కి జంటగా నటించిన `డాక్టర్` (2021) చిత్రం ప్రియాంకకి తమిళనాట సక్సెస్ ఫుల్ డెబ్యూగా నిలిచింది. అటుపై, స్టార్ హీరో సూర్యకి జోడీగా `ఈటీ`లో మెరిసినా ఆ స్థాయి హిట్ దక్కలేదు. ఈ నేపథ్యంలో.. శివ కార్తికేయన్ కి జంటగానే `డాన్` చిత్రంలో మరోసారి నటించింది ప్రియాంక. మే 13న విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా.. బాక్సాఫీస్ ముంగిట మంచి వసూళ్ళు ఆర్జిస్తోంది. దీంతో.. ప్రియాంక ఖాతాలో మరో హిట్టు బొమ్మ జమ అయినట్టే అంటున్నారు తమిళ జనాలు. మొత్తమ్మీద.. `డాక్టర్`, `డాన్` - ఇలా శివ కార్తికేయన్ వరుస చిత్రాల్లో కథానాయికగా నటించడమే కాకుండా రెండు సినిమాలతోనూ విజయాలు అందుకుని వార్తల్లో నిలుస్తోంది ప్రియాంక. మరి.. ఇదే ఊపులో శివ, ప్రియాంక జోడీ హ్యాట్రిక్ కి రెడీ అవుతుందేమో చూడాలి.
![]() |
![]() |