![]() |
![]() |

`యమదొంగ`(2007)లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, `జనతా గ్యారేజ్`(2016)లో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్.. ఇలా అవకాశం దొరికినప్పుడల్లా, స్క్రిప్ట్ డిమాండ్ చేసినప్పుడల్లా సీనియర్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూనే వస్తున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కట్ చేస్తే.. త్వరలో ఈ నందమూరి స్టార్ మరో సీనియర్ హీరోతో కలిసి నటించే అవకాశముందని ఫిల్మ్ నగర్ బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ ఓ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 31` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ భారీ బడ్జెట్ వెంచర్ ని.. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుంది. ఈ ఏడాది అక్టోబర్ లో పూజా కార్యక్రమాలు జరుపుకోనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుందట. కాగా, ఈ సినిమాలో తారక్ పాత్రతో సమానంగా ఉండే మరో హీరో రోల్ ఉందట. ఆ పాత్రలో లోక నాయకుడు కమల్ హాసన్ ని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారట ప్రశాంత్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
![]() |
![]() |