![]() |
![]() |

`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` (2019), `జాతి రత్నాలు` (2021) చిత్రాలతో తెలుగునాట కథానాయకుడిగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి `అనగనగా ఒక రాజు` కాగా.. మరొకటి స్టార్ బ్యూటీ అనుష్కా శెట్టితో కలిసి నటిస్తున్న పేరు నిర్ణయించని చిత్రం.
ఇదిలా ఉంటే.. తాజాగా నవీన్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో స్పెషల్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ వివరాల్లోకి వెళితే.. నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో బాలయ్య నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో కనిపించనున్నారు. కాగా, ఇందులో ఓ స్పెషల్ రోల్ ఉందని.. ఆ పాత్రలో `డీజే టిల్లు` ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ సందడి చేయనున్నాడని ఆ మధ్య ప్రచారం జరిగింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇంట్రవెల్ ఎపిసోడ్ లో ఎంటరై సెకండాఫ్ లో హిలేరియస్ గా సాగే ఈ క్యారెక్టర్ లో నవీన్ పోలిశెట్టి కనిపిస్తాడట. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
![]() |
![]() |