![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' సంచలనం సృష్టించింది. ఐదు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల షేర్ రాబట్టిందట. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తెలుపుతూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్ ను విడుదల చేసింది. పాన్ ఇండియా సినిమాలు కాకుండా వేగంగా రూ.100 కోట్ల షేర్, రూ.160 కోట్ల గ్రాస్ రాబట్టిన సినిమాగా 'సర్కారు వారి పాట' రికార్డు క్రియేట్ చేసినట్లు పోస్టర్ లో పేర్కొన్నారు. రీజినల్ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

వంద కోట్ల షేర్ మార్క్ ని మహేష్ వరుసగా నాలుగోసారి అందుకోవడం విశేషం. మహేష్ గత మూడు చిత్రాలు 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలు వంద కోట్లకు పైగా షేర్ రాబట్టాయి. మేకర్స్ తెలిపిన దాని ప్రకారం ఇప్పుడు 'సర్కారు వారి పాట' కేవలం ఐదు రోజుల్లోనే ఈ ఫీట్ సాధించింది. సర్కారు జోరు చూస్తుంటే.. ముందు ముందు ఈ సినిమా మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశముంది. మహేష్ గత చిత్రం సరిలేరు నీకెవ్వరు రూ.139 కోట్ల షేర్(223 గ్రాస్) రాబట్టగా.. ఇప్పుడు 'సర్కారు వారి పాట' ఆ కలెక్షన్స్ ని బీట్ చేసి మహేష్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు.
![]() |
![]() |