![]() |
![]() |

వర్ష బొల్లమ్మ... అందంతో కంటే అభినయంతో ఎక్కువ ఆకట్టుకున్న అమ్మాయి. శర్వానంద్, సమంత జంటగా నటించిన 'జాను'లో ఫొటోగ్రఫీ స్టూడెంట్‌గా చిన్న పాత్రలో నటించినా ఎక్కువ గుర్తింపు సొంతం చేసుకుంది. 'జాను' మాతృక '96'లోనూ ఆ పాత్రలో ఆమె నటించింది. 'జాను' తరవాత 'చూసీ చూడంగానే' అని మరో సినిమా చేసింది. అది ప్లాప్.
'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో మరోసారి ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వర్ష బొల్లమ్మ వస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందే మరో అవకాశం అందుకుంది. రాజ్ తరుణ్ సరసన ఇప్పుడామె ఓ సినిమా చేస్తోంది. ఆ సినిమాకి 'స్టాండప్ రాహుల్' టైటిల్ ఖరారు చేసినట్టు వర్ష బొల్లమ్మ చెప్పింది. ఈ మధ్య రాజ్ తరుణ్ సరైన విజయాలు అందుకోలేక సతమతమవుతున్నాడు. అతడికి 'స్టాండప్ రాహుల్' హిట్ ఇచ్చి స్టాండ్ అయ్యేలా చేస్తుందని ఆశిద్దాం.
![]() |
![]() |