![]() |
![]() |

తమిళ నటుడు సెల్వరత్నం (42)ను చెన్నైలోని ఎంజీఆర్ నగర్లో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. గత పది సంవత్సరాలుగా ఇటు సినిమాలు, అటు టీవీ సీరియల్స్‌లో ఆయన నటిస్తున్నాడు. లేటెస్ట్ తమిళ పాపులర్ సీరియల్ 'తెన్మోళి బీఏ'లో మెయిన్ విలన్ ఆయనే. శ్రీలంక శరణార్ధి అయిన సెల్వరత్వం భార్య, పిల్లలు విరుదునగర్ జిల్లాలోని ఓ శరణార్ధి శిబిరంలో ఉంటున్నారు.
శనివారం సెల్వరత్నం షూటింగ్‌కు వెళ్లకుండా తన మిత్రుడైన అసిస్టెంట్ డైరెక్టర్ మణి దగ్గర ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఆదివారం తెల్లవారుతుందనంగా ఫోన్ కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్లాడు. తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తున్నానని మణికి చెప్పి వెళ్లాడు. అంతకు మించి వేరే సమాచారం ఏదీ ఆయన ఇవ్వలేదు. అయితే గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు అన్నా నెడుంపదై అనే చోట సెల్వరత్నంను నరికి చంపారని మణికి సమాచారం అందింది. వెంటనే అతను పోలీసులను అలెర్ట్ చేసి, ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అనంతరం సెల్వరత్నం భౌతిక కాయాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ప్రభుత్వ రోయపేట హాస్పిటల్‌కు తరలించారు.
![]() |
![]() |