![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ విజయ్, మల్టిటాలెంటెడ్ ఎస్. జె. సూర్యది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. విజయ్ హీరోగా సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషి (2000) అప్పట్లో తమిళ యువతని ఉర్రూతలూగించింది. అలాగే విజయ్ కథానాయకుడిగా సూర్య ప్రతినాయకుడిగా నటించిన మెర్సల్ (తెలుగులో అదిరింది) కూడా వసూళ్ళ వర్షం కురిపించింది. అలాంటి ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా రానుందట. ఈ సారి వచ్చే సినిమాకి సూర్య దర్శకత్వం వహిస్తారని కోలీవుడ్ బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. విడుదలకు సిద్ధమైన మాస్టర్ తరువాత తన లక్కీ డైరెక్టర్ ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్ లో విజయ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని టాక్. ఈ నేపథ్యంలో... కొలమావు కోకిల, డాక్టర్ చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో విజయ్ నెక్స్ట్ వెంచర్ ఉంటుందని ప్రచారం సాగింది. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు సూర్య పేరు వెలుగులోకి వచ్చింది.
మరి.. 20 ఏళ్ళ తరువాత మళ్ళీ జట్టుకడుతున్న విజయ్, సూర్య.. ఖుషి మ్యాజిక్ ని మరోమారు రిపీట్ చేస్తారేమో చూడాలి.
![]() |
![]() |