![]() |
![]() |

'నువ్వే నువ్వే' నుండి 'అల... వైకుంఠపురములో' వరకూ... శ్రియ, త్రిష, ఇలియానా, సమంత, పూజా హెగ్డే, కీర్తీ సురేష్ - ఇలా అప్పట్లో స్టార్‌గా ఉన్నవాళ్ళను మెయిన్ హీరోయిన్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ సెలెక్ట్ చేశారు. సెకండ్ హీరోయిన్‌గా స్టార్‌డమ్ రాని అందగత్తెలను సెలెక్ట్ చేయడం ఆయన స్టయిల్. ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేయబోయే ఎన్టీఆర్30కి ఆ పంథా మార్చి కొత్తమ్మాయిని హీరోయిన్‌గా సెలెక్ట్ చేస్తున్నారని టాక్.

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'రొమాంటిక్'. ఇందులో కేతికా శర్మ హీరోయిన్. ఎన్టీఆర్30లో యంగ్ టైగర్ సరసన నటించే అవకాశాన్ని ఆమెకు త్రివిక్రమ్ ఇస్తున్నాడని టాక్. ఆహా కోసం త్రివిక్రమ్ ఒక యాడ్ రూపొందించారు. అందులో అల్లు అర్జున్ సరసన కేతికా శర్మ నటించింది. యాడ్ చేసిన తరవాత ఎన్టీఆర్30లో హీరోయిన్ రోల్ ఆమెకు ఆఫర్ చేశారట.
![]() |
![]() |