![]() |
![]() |

తమిళంలో ఇరుది సుట్రుగా, హిందీలో సాలా ఖడూస్ గా విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో గురు పేరుతో రీమేక్ చేసి మూడు భాషల్లోనూ సక్సెస్ అందుకున్నారు దర్శకురాలు సుధ కొంగర. ఇప్పుడిదే శైలిని మరోరకంగా కొనసాగించే దిశగా అడుగులు వేస్తున్నారట ఆమె.
ఆ వివరాల్లోకి వెళితే.. ఈ నెల 12 నుంచి తమిళంలో సూరారై పోట్రు పేరుతోనూ, తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతోనూ సుధ డైరెక్షన్ లో రూపొందిన కొత్త చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. సూర్య కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి రెండు చోట్ల విశేషాదరణ దక్కింది. ఈ నేపథ్యంలో.. ఈ చిత్రాన్ని బాలీవుడ్ కి తీసుకెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాదు.. హిందీ వెర్షన్ కి కూడా సుధనే దర్శకత్వం వహించే అవకాశముందంటున్నారు.
అదే విధంగా.. ఈ రీమేక్ లో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ నటించబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఈ క్రేజీ రీమేక్ కి సంబంధించి మరింత సమాచారం వెల్లడయ్యే అవకాశముంది.
![]() |
![]() |