![]() |
![]() |

ఇటీవలే ఒరేయ్ బుజ్జిగా సందడి చేశారు యువ కథానాయకుడు రాజ్ తరుణ్. ఆహాలో స్ట్రీమ్ అయిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కి మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. చాన్నాళ్ళుగా సరైన విజయం లేని రాజ్ కి కొంతవరకు ఊరటనిచ్చిందీ సినిమా. కాగా ప్రస్తుతం ఈ టాలెంటెడ్ యంగ్ హీరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి.. ఒరేయ్ బుజ్జిగా దర్శకుడు విజయ్ కుమార్ కొండ కాంబినేషన్ లోనే రానుంది. మరొకటి.. శాంటో డైరెక్షన్ లో తెరకెక్కుతోంది.
శాంటో దర్శకత్వంలో వస్తున్న సినిమాకి స్టాండప్ రాహుల్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసిందట. చిన్నప్పటి నుంచి తరగతి గదిలో అల్లరి చేస్తూ.. మాస్టార్ల చేత మాటిమాటికి స్టాండప్ రాహుల్ అనిపించుకునే తరహా పాత్ర ఇదని సమాచారం. వర్ష బొల్లమ్మ నాయికగా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. మరి.. స్టాండప్ రాహుల్ తోనైనా రాజ్ తరుణ్ కోరుకుంటున్న విజయం దక్కుతుందేమో చూడాలి.
![]() |
![]() |