![]() |
![]() |

మలయాళంలో విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మల్టిస్టారర్ ఫిల్మ్ లో ఓ కథానాయకుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్నారు. మలయాళంలో బిజూ మీనన్ పోషించిన పోలీస్ అధికారి పాత్రలో పవన్ దర్శనమివ్వనున్నారు.
ఇక ఒరిజినల్ లో పృథ్వీరాజ్ పోషించిన పాత్రలో ఎవరు నటిస్తారనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఒకవైపు రానా పేరు ప్రముఖంగా వినిపిస్తుంటే.. మరోవైపు కన్నడ నటుడు సుదీప్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో హీరో పేరు చేరింది. ఆ కథానాయకుడు మరెవరో కాదు.. గోపీచంద్. మరి.. గోపీచంద్ అయినా పవన్ తో జాయిన్ అవుతారో లేదంటే వార్తలకే పరిమితమవుతారో చూడాలి.
సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించనుంది. యువ సంగీత సంచలనం తమన్ స్వరాలు సమకూర్చనున్నారు.
![]() |
![]() |