![]() |
![]() |

గత కొంతకాలంగా కింగ్ నాగార్జున మల్టిస్టారర్స్ పై దృష్టి సారిస్తున్నారు. ఆ మధ్య నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో `దేవదాస్` చేశారు నాగ్. రీసెంట్ గా తన తనయుడు, యువ సామ్రాట్ నాగచైతన్యతో కలిసి `బంగార్రాజు` చేశారు. కట్ చేస్తే.. త్వరలో తన చిన్న కొడుకు అఖిల్ అక్కినేనితో ఓ మల్టిస్టారర్ చేయబోతున్నారట నాగార్జున. అది కూడా తన ల్యాండ్ మార్క్ మూవీగా..
Also Read: ఫ్యాన్స్ దెబ్బకి 'భీమ్లా నాయక్' కొత్త ట్రైలర్ వచ్చింది
ఆ వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఓటీటీలో స్ట్రీమ్ అయిన మలయాళ చిత్రం `బ్రో డాడీ` (మోహన్ లాల్, పృథ్వీరాజ్)ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట నాగ్. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగ్ స్వయంగా నిర్మించనున్న ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా తమ నిజజీవిత పాత్రల్లో కనిపించనున్నారట నాగ్, అఖిల్. అంతేకాదు.. నాగ్ 100వ సినిమాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ రూపొందనుందట.
Also Read: 'అంటే సుందరానికీ' రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. 'మొహం పగిలిపోతుంది' అని నాని ట్వీట్
కాగా, ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో `ద ఘోస్ట్` చేస్తున్నారు నాగార్జున. మరోవైపు.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో `ఏజెంట్` చేస్తున్నాడు అఖిల్. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి రాబోతున్నాయి. నాగ్, అఖిల్ మల్టిస్టారర్ కూడా 2022 సెకండాఫ్ లోనే పట్టాలెక్కనుందట. కాగా, ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారట. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో `లూసీఫర్` రీమేక్ `గాడ్ ఫాదర్` తీస్తున్నారు.
![]() |
![]() |