![]() |
![]() |

అతిలోక సుందరి శ్రీదేవికి హిందీనాట నటిగా మంచి గుర్తింపుని తీసుకువచ్చిన చిత్రాల్లో `జుదాయి` ఒకటి. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ `శుభలగ్నం` (1994) ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో.. ధనవ్యామోహంలో పడి సంసారజీవితాన్ని నాశనం చేసుకునే కాజల్ అనే పడతి పాత్రలో ఆకట్టుకుంది శ్రీదేవి. మాతృకలో ఆమని ధరించిన ఈ పాత్రని తనదైన అభినయంతో, హావభావాలతో రక్తికట్టించింది శ్రీదేవి. ఇక జగపతి బాబు పోషించిన పాత్రలో అనిల్ కపూర్ అలరించగా.. రోజా అభినయించిన వేషంలో ఊర్మిళ ఎంటర్టైన్ చేసింది. పరేష్ రావెల్, ఫరీదా జలాల్, కదేర్ ఖాన్, జానీ లివర్, ఉపాసన సింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించగా.. పూనమ్ థిల్లాన్ అతిథిగా దర్శనమిచ్చింది. రాజ్ కన్వర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి `బిగ్ బి` అమితాబ్ బచ్చన్ నెరేషన్ ఇవ్వడం విశేషం.
Also Read: హీరోయిన్ గా శ్రీదేవి చిన్నకూతురు.. కన్ఫర్మ్ చేసిన బోనీ కపూర్
నదీమ్ - శ్రావణ్ సంగీతసారథ్యంలో రూపొందిన గీతాలన్నీ రంజింపజేశాయి. మరీముఖ్యంగా.. ``ముఝే ప్యార్ హువా అల్లామియా``, టైటిల్ సాంగ్ ``జుదాయి జుదాయి``, ``ప్యార్ ప్యార్ కర్తే కర్తే`` పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. సురిందర్ కపూర్ నిర్మాణంలో 1997 ఫిబ్రవరి 28న విడుదలై ఆ ఏడాది మేటి గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచిన `జుదాయి`.. నేటితో పాతికేళ్ళు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |