![]() |
![]() |

'రాజావారు రాణిగారు', 'ఎస్ఆర్ కళ్యాణమండపం' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్ పై కన్నేశాడు. మొదటి రెండు సినిమాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్న కిరణ్.. మూడో సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. కిరణ్ హీరోగా నటించిన మూడో మూవీ 'సెబాస్టియన్ పిసి 524' మార్చి 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ట్రైలర్ తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదలైంది. ట్రైలర్ ఆకట్టుకుందని, సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని విజయ్ ట్వీట్ చేశాడు.
టీజర్ తోనే 'సెబాస్టియన్' మూవీ రేచీకటి ఉన్న కానిస్టేబుల్ స్టొరీ అని అర్థమైంది. టీజర్ తోనే ఫుల్ గా నవ్వించిన కిరణ్ ట్రైలర్ తో మరింత ఆకట్టుకున్నాడు. రేచీకటి కానిస్టేబుల్ పాత్రలో కిరణ్ చక్కగా ఒదిగిపోయాడు. 'నాకు రాత్రి డ్యూటీలు వద్దు, పగలు డ్యూటీలు వేయండి' అంటూ నవ్వులు పూయించాడు. నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో ఒక క్రైమ్ జరగడంతో, సెబాస్టియన్ ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చివరిలో 'పోలీసోడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే వెళ్తాడు పోస్టాఫీస్ కి కాదు' అంటూ విక్రమార్కుడు డైలాగ్ ని తనదైన శైలిలో చెప్పి నవ్వించాడు కిరణ్. ఘిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ట్రైలర్ చూస్తుంటే కిరణ్ హ్యాట్రిక్ కొట్టేలా ఉన్నాడు.
ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్ధారెడ్డి బి, రాజు, ప్రమోద్ ఈ సినిమాని నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించాడు. కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దారేకర్), శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
![]() |
![]() |