Home

»

Latest News

ఫ్యాన్స్ దెబ్బకి 'భీమ్లా నాయక్' కొత్త ట్రైలర్ వచ్చింది

Feb 23, 2022 8:25PM

రీసెంట్ గా పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల మల్టీస్టారర్ 'భీమ్లా నాయక్' ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ 24 గంటల్లో యూట్యూబ్ లో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే ఈ ట్రైలర్ పట్ల పవన్ ఫ్యాన్స్ కాస్త నిరాశచెందారు. ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేదని, ట్రైలర్ లో పవన్ హైలైట్ అవ్వలేదని, తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా ఆకట్టుకోలేదని పలువురు మండిపడ్డారు. అయితే తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ లో కొత్త ట్రైలర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది మూవీ టీమ్.

హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్  గ్రాండ్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేయించారు మేకర్స్. కొత్త ట్రైలర్ గత ట్రైలర్ ని మించి చాలా పవర్ ఫుల్ గా ఉంది. పవన్, రానా ల మధ్య పోటాపోటీ డైలాగ్స్, ఫైట్స్ తో ఆద్యంతం ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటోంది.

ఫిబ్రవరి 25 న థియేటర్స్ లో పవర్ తుఫాన్ హెచ్చరిక అంటూ రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ కొత్త ట్రైలర్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com