![]() |
![]() |

సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తికి స్పెషల్ కోర్టులో చుక్కెదురైంది. శుక్రవారంనాడు ఆమెతో సహా సోదరుడు షోవిక్ చక్రవర్తి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను స్పెషల్ కోర్టు తిరస్కరించింది. వాళ్ళు ఇద్దరూ డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. వాళ్ళతో పాటు మరో నలుగురు ఈ కేసులో కటకటాల వెనక్కి వెళ్లారు. ఈ ఆరుగురు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. కానీ కోర్టు రిజెక్ట్ చేసింది.
సుశాంత్ కి మాదక ద్రవ్యాలు అందించినట్లు స్వయంగా రియా చక్రవర్తి ఒప్పుకోవడంతో ఆమెను అరెస్ట్ చేశారు. తక్కువ మోతాదులో మాదకద్రవ్యాలు దొరికినప్పటికీ... మార్కెట్ లో వాటి విలువ సుమారు ఒక లక్ష 85 వేల రూపాయలు ఉన్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలియజేసింది. బెయిలు మంజూరు చేయకూడదని కోర్టులో బలంగా వాదించింది. స్పెషల్ కోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత హైకోర్టుకు వెళ్లే విషయమై ఆలోచిస్తామని రియా చక్రవర్తి న్యాయవాది తెలియజేశారు.
![]() |
![]() |