![]() |
![]() |

సుశాంత్ తండ్రి కేసింగ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రియా చక్రవర్తి పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ ఆరోపణలపై కేసు రిజిస్టర్ చేసింది. కొన్ని రోజులు ఆమెను ఆఫీసుకు పిలిపించి విచారించింది. తన కుమారుడి ఖాతాలో 15 కోట్ల రూపాయలను అక్రమంగా ఇతర ఖాతాలకు రియా, ఆమె కుటుంబం మరణించిందని కేకే సింగ్ ఆరోపించారు. అటువంటి నిధుల గోల్ మాల్ ఏది జరగలేదని ఈడీ తేల్చింది. ఆ తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగింది. రియా చక్రవర్తి వాట్సాప్ చాట్ ఆధారంగా విచారణ చేపట్టి ఆమెను అరెస్టు చేసింది.
ఎన్సీబీ విచారణలో బయటపడిన ఆధారాలను బేస్ చేసుకుని రియా చక్రవర్తిపై కొత్తగా కేసు పెట్టే అవకాశాలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. మనీ లాండరింగ్ మీద కొత్త కేసు పెట్టే వచ్చేమోనని అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నామని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. ఎన్సీబీ ఇన్వెస్టిగేషన్ కాపీని పరిశీలించి నిర్ణయం తీసుకుంటారట. డ్రగ్ ట్రాఫికింగ్, డ్రగ్ సెల్స్ ద్వారా వచ్చిన డబ్బు ఏమైందనే నేపథ్యంలో తాజాగా కేసు ఫైల్ చేయాలని చూస్తున్నారు. ఈ నెల 22 వరకు డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి గారు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
![]() |
![]() |