![]() |
![]() |

సుశాంత్ మర్డర్ మిస్టరీ పలు మలుపులు తిరిగి చివరకు డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి అరెస్ట్ అయ్యింది. హిందీ చలనచిత్ర పరిశ్రమను ఆ కేసు షేక్ చేస్తోంది. అదేసమయంలో దక్షిణాదిన మరో డ్రగ్స్ కేసు వెలుగు చూసింది. కన్నడ చిత్ర పరిశ్రమ ప్రముఖులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసిన ఓ డ్రగ్ రాకెట్ తో సినిమా పరిశ్రమకు లింకు ఉన్నట్లు తేలింది. ఆ కేసులో హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ అరెస్టయ్యారు. ఆ సంగతి తెలిసిందే.
సంజనా గల్రానీకి డోప్ టెస్ట్ నిర్వహించడానికి బెంగళూరులోని కేసీ జనరల్ ఆసుపత్రికి సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తీసుకు వెళ్లారు. అంతకుముందే డ్రగ్ పరీక్షలు నిర్వహించడానికి కోర్టు నుంచి అనుమతి సైతం తీసుకున్నారు. అయితే, ఆ పరీక్షలకు రక్తం ఇవ్వడానికి సంజన నిరాకరించారు. పోలీస్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. గొడవ పడ్డారు. "నాకు వ్యతిరేకంగా ఏ ఆధారాలు లేవు. నేను ఎటువంటి పరీక్షలు చేయించుకోను. ఈ పరీక్షల గురించి నాకు నా లాయర్ చెప్పాలి. ఫోన్ లో ఎవరితోనో మాట్లాడితే అది నా తప్పా?" అంటూ సంజనా గల్రానీ గొడవ పడ్డారట. డోప్ టెస్ట్ కి కోర్టు అనుమతి ఇచ్చిందని అధికారులు చెప్పడానికి ప్రయత్నించినా ఆమె వినలేదని సమాచారం.
![]() |
![]() |