![]() |
![]() |

అక్టోబర్ నెలాఖరున మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా ప్రజల ముందుకు వస్తుందా? అంటే అవుననే సమాధానం ఫిలిం నగర్ వర్గాల నుండి వినబడుతోంది. థియేటర్లు ఓపెన్ కాకుండా సినిమా ఎక్కడ విడుదల అవుతుంది? అనే సందేహం వచ్చిందా!? థియేటర్లలో కాదు... ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ అవుతుందట. దసరా సందర్భంగా స్ట్రీమింగ్ కానుందని టాక్.
సాయిధరమ్ తేజ్ సరసన నభానటేష్ కథానాయికగా నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వాస్తవానికి మేలో సినిమాని విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా అడ్డుపడింది. సినిమా విడుదలకు మాత్రమే కాదు... షూటింగుకు కూడా! ఇటీవల మళ్లీ షూటింగ్ రీ స్టార్ట్ చేశారు. రామోజీ ఫిలిం సిటీ లో ఒక పాటను తెరకెక్కించారు. మిగతా సన్నివేశాలను కూడా పూర్తి చేశారు. ఈరోజు తో సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. నిర్మాణానంతర కార్యక్రమాలను త్వరగా పూర్తిచేసి ఓటీటీ విడుదలకు సినిమాను సిద్ధం చేయనున్నారు.
![]() |
![]() |