![]() |
![]() |

డబ్బుకు లోకం దాసోహం అనే మాటను ప్రతి ఒక్కరూ నమ్ముతారు. దేన్నైనా డబ్బుతో కొనవచ్చు కానీ, సంతోషాన్ని మాత్రం కొనలేమనే మాట కూడా వినిపిస్తుంటుంది. ఏదేమైనా కొంతమంది తారలు ఈ రెండో నానుడిని తప్పని నిరూపిస్తున్నారు. కోట్లకు అధిపతుల్ని పెళ్లాడి సంతోషంగా జీవితాన్ని సాగిస్తున్నారు. ఎప్పుడూ డబ్బులో మునిగితేలే బిజినెస్ టైకూన్స్‌ను పెళ్లాడిన వాళ్లు కొంతమైందైతే, తమ పేరు బలంతోటే డబ్బు సంపాదించే సెలబ్రిటీలను పెళ్లాడిన వాళ్లు కొంతమంది. డబ్బుకు డబ్బు, సంతోషానికి సంతోషం పొందుతోన్న ఆ తారలెవరంటే...
అమల అక్కినేని
టాలీవుడ్‌లో గ్లామరస్ హీరోయిన్‌గా టాప్ స్టార్స్‌తో నటిస్తూ, తనతో కొన్ని సినిమాలు చేసిన నాగార్జునతో ప్రేమలో పడి, ఆయనను పెళ్లాడారు అమల. అప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్‌లో భాగస్వామ్యం ఉన్న నాగార్జున ఆ తర్వాత పలు వ్యాపారాలు నెలకొల్పి టాలీవుడ్ రిచ్చెస్ట్ పర్సన్స్‌లో ఒకరిగా ఎదిగారు. 2019 లెక్కల ప్రకారం ఆయన నికర ఆస్తులు 850 కోట్ల రూపాయలు.
అనుష్కా శర్మ
ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్, వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీ విరాట్ కోహ్లీని 2017లో పెళ్లాడింది అందాల తార అనుష్కా శర్మ. బీసీసీఐ ద్వారా ఏటా 7 కోట్ల రూపాలయ శాలరీ అందుకుంటున్న విరాట్ అనేక పేరుపొందిన బ్రాండ్లకు అంబాసడర్‌గా పనిచేస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాడు. ప్రస్తుత అంచనా ప్రకారం అతని నికర ఆస్తులు 26 మిలియన్ డాలర్లు.
అసిన్
టాలీవుడ్, బాలీవుడ్‌లో జయకేతనం ఎగురవేసిన మల్లు సుందరి అసిన్.. మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడైన రాహుల్ శర్మతో మూడు ముళ్లు వేయించుకుంది. అతని కంపెనీ ఏటా బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తోంది. అతనికి సొంతంగా 668 కోట్ల రూపాయల విలువ చేసే నికర ఆస్తులున్నాయి. మూడెకరాల సువిశాల విస్తీర్ణంలో ఫామ్‌హౌస్ కూడా ఉంది.
ఆయేషా టకియా
నాగార్జున 'సూపర్' హీరోయిన్ ఆయేషా టకియా కెరీర్ మంచి ఊపు మీద ఉన్నప్పుడే, కేవలం 23 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది. ఆమె భర్త ఫేమస్ పొలిటీషియన్ అబు అజ్మీ కుమారుడు ఫరాన్ అజ్మీ. అతను పెద్ద హోటల్ చైన్‌కు అధిపతి. 2019 లెక్కల ప్రకారం అతని నికర ఆస్తులు 66 కోట్ల రూపాయలు.
ఈషా డియోల్
ధర్మంద్ర-హేమమాలిని దంపతుల కుమార్తె ఈషా డియోల్ తన చిన్ననాటి స్నేహితుడు భరత్ తఖ్తానీని పెళ్లి చేసుకుంది. అతనికి ఆర్.జి. బంగ్లే ప్రైవేట్ లిమిటెడ్ అనే డైమండ్ కంపెనీ ఉంది. అతనికి బాగా సంపన్న కుటుంబం. అతనికి 475 మిలియన్ డాలర్ల నికర ఆస్తులున్నాయి.
జుహీ చావ్లా
ఎప్పుడు మొహంపై చిరునవ్వు చెరగనివ్వని జుహీ చావ్లా.. మెహతా గ్రూప్ యజమాని జయ్ మెహతాను పెళ్లి చేసుకుంది. ఆఫ్రికా, యు.ఎస్., కెనడా, ఇండియాలలో విస్తరించివున్న ఆ కంపెనీ విస్తరించి ఉంది. జయ్ నికర ఆస్తుల విలువ 2019 లెక్కల ప్రకారం 2400 కోట్ల రూపాయలు.
నమ్రతా శిరోద్కర్
బాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్‌కు చెందిన స్టార్ యాక్టర్ మహేశ్‌బాబు పెళ్లాడింది నమ్రతా శిరోద్కర్. పెళ్లి తర్వాత సూపర్ స్టార్‌గా ఎదిగిన మహేశ్ సినిమాల నుంచే కాకుండా, బ్రాండ్ అంబాసిడర్‌గానూ కోట్లు సంపాదిస్తున్నాడు. అతని నికర ఆస్తుల విలువ 113 కోట్ల రూపాయలని అంచనా.
రాణీ ముఖర్జీ
అసలు పెళ్లి చేసుకోదేమోనని అందరూ భావిస్తున్న కాలంలో టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రాను పెళ్లాడి అందర్నీ ఆశ్చర్యపర్చింది రాణీ ముఖర్జీ. ఇవాళ 6,350 కోట్ల రూపాయల ఆస్తులకు ఆదిత్య యజమాని.
రవీనా టాండన్
తెలుగులోనూ కొన్ని సినిమాల్లోనూ నటించిన రవీనా టాండన్ పేరుపొందిన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అనిత్ తడానీని వివాహం చేసుకుంది. కరణ్ జోహార్‌తో కలిసి 'బాహుబలి' సినిమాలను అతను డిస్ట్రిబ్యూట్ చేశాడు. అతని నికర ఆస్తుల విలువ 6.5 మిలియన్ డాలర్లు.
శిల్పాశెట్టి
స్వీట్‌హార్ట్ శిల్పాశెట్టి బ్రిటిష్-ఇండియన్ బిజినెస్‌మ్యాన్ రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుంది. గ్రూప్‌కో డెవలపర్స్, టీఎంటీ గ్లోబల్ అనే కంపెనీలు నడుపుతున్న రాజ్ కుంద్రా.. ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని కూడా. అతని నికర ఆస్తుల విలువ 400 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.
సోనమ్ కపూర్
అత్యంత సంపన్నవంతుడైన ఆనంద్ ఆహుజాను 2018లో పెళ్లాడింది అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్. భానే, వెజ్ నాన్‌వెజ్ అనే రెండు కంపెనీలున్నాయి. అంతేకాదు, దేశంలోని పెద్ద ఎక్స్‌పోర్ట్ కంపెనీల్లో ఒకటైన షాహీ ఎక్స్‌పోర్ట్స్ సహ యజమాని కూడా. అతని నికర ఆస్తుల విలువ 3 వేల కోట్ల రూపాయలని అంచనా.
విద్యా బాలన్
వివాహానంతరం కూడా సినిమా కెరీర్‌ను ఎంజాయ్ చేస్తున్న విద్యా బాలన్ ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ను పెళ్లాడింది. అతను వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియాకు ఎండీగా వ్యవహరిస్తున్నాడు. అతని నికర ఆస్తుల విలువ 475 మిలియన్ డాలర్లు అని అంచనా.
![]() |
![]() |