![]() |
![]() |

'బిగ్ బాస్' షో మొదలు కాకముందు... అందులో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్లు వీళ్ళేనంటూ ఓ లిస్ట్ చక్కర్లు కొట్టింది. ప్రముఖ గాయని సునీత పేరు అందులో ఉంది. అప్పుడు ఆమె తాను 'బిగ్ బాస్'లో భాగం కావడం లేదని వివరణ ఇచ్చారు. తాజాగా మరో ఫేమస్ సింగర్ చిన్మయి కూడా 'బిగ్ బాస్'కి నో చెప్పారు. అయితే... ఆమె తెలుగు 'బిగ్ బాస్' గురించి మాట్లాడలేదు. తమిళ 'బిగ్ బాస్' గురించి మాట్లాడారు.
కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తమిళ 'బిగ్ బాస్' త్వరలో మొదలు కానుంది. అందులో ఎవరెవరు పాల్గొంటారనేది ఇంకా వెల్లడించలేదు. పలు ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. గాయని చిన్మయి ఈ ఏడాది తమిళ 'బిగ్ బాస్'లో పాల్గొనవచ్చని ప్రచారం జరుగుతోంది. దాన్ని ఆమె ఖండించారు.
ఒక యూట్యూబ్ వీడియోలో తనను కాంట్రవర్షియల్ లేడీగా పేర్కొనడం పైనా చిన్మయి అభ్యంతరం వ్యక్తం చేశారు. వివాదం అంటే ఏంటో? ప్రజలకు అవగాహన కల్పించడం అంటే ఏంటో? యూట్యూబ్ ఛానల్స్, మీమ్ మేకర్స్ కి తెలియదని అని ఆమె అన్నారు. తానెప్పుడూ బిగ్బాస్ వంటి షోలో ఉండాలని స్పష్టం చేశారు. డబ్బు సంపాదించడం కోసం పబ్లిసిటీ కోసం తన పేరును అటువంటి కథనాలలో వాడుతున్నారని చిన్మయి అన్నారు.
![]() |
![]() |