![]() |
![]() |

దళపతి విజయ్ తండ్రి, సీనియర్ డైరెక్టర్ ఎస్.ఎ. చంద్రశేఖర్ 'బీస్ట్' డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్‌ను తప్పుపట్టారు. రీసెంట్‌గా ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'బీస్ట్' మూవీ పూర్తిగా విజయ్ స్టార్ పవర్ మీద ఆధారపడిందనీ, స్క్రీన్‌ప్లే ఆశించిన రీతిలో లేదనీ అన్నారు. బాక్సాఫీస్ దగ్గర కచ్చితంగా బాగా ఆడుతుందని చెప్పిన ఆయన, అదే సమయంలో స్క్రీన్‌ప్లేలో మ్యాజిక్ మిస్సయ్యిందని అభిప్రాయపడ్డారు.
నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేసిన 'బీస్ట్' ఏప్రిల్ 13న విడుదలైంది. బాక్సాఫీస్ కలెక్షన్ విషయంలో బాగానే ఉన్నప్పటికీ, విమర్శకుల నుంచీ, ప్రేక్షకుల నుంచీ దానికి ప్రశంసలు లభించడం లేదు. "ఒక వీరాభిమాని లాగా 'అరబిక్ కుత్తు' సాంగ్‌ను ఎంజాయ్ చేశాను. కానీ, 'బీస్ట్' పూర్తిగా విజయ్ స్టార్‌డమ్‌పై ఆధారపడింది. ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్‌పై సీరియస్ సబ్జెక్టుతో ఈ సినిమాని తీశారు. స్క్రీన్‌ప్లేలో మ్యాజిక్ అనేది ఉండాలి. అదెక్కడ ఉంది? మిలటరీ అనేది ఎలా పనిచేస్తుందో డైరెక్టర్ స్టడీ చేయాల్సింది. 'రా' ఏజెంట్ ఎలా బిహేవ్ చేస్తాడో తెలుసుకోవాలి. అది ఈ సినిమాలో మిస్సయింది" అని చంద్రశేఖర్ అన్నారు.
'బీస్ట్' హిట్టవుతుందనడంలో తనకు డౌట్ లేదని చెప్పిన ఆయన, మ్యూజిక్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్, ఎడిటర్, హీరో వల్లే ఆ సినిమా ఆడుతోందని ఆయన చెప్పారు. డైరెక్టర్ నెల్సన్ పేరును ఆయన ప్రస్తావించలేదు.
విడుదలయ్యాక మిశ్రమ స్పందనను అందుకున్న 'బీస్ట్' మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీలో పూజా హెగ్డే, సెల్వరాఘవన్, యోగిబాబు, రెడిన్ కింగ్‌స్లే, షైన్ టామ్ చాకో తదితరులు నటించారు.
![]() |
![]() |