![]() |
![]() |
.webp)
సిల్వర్ స్క్రీన్ మీద సైడ్ క్యారెక్టర్ మీసాల లక్ష్మణ్ అంటే ఎవరికీ తెలీదు కానీ మంగళవారం మూవీలో పులిగాడు అంటే చాలు గడ్డాలు మీసాలతో కళ్ళు కనిపించని వ్యక్తిగా తిరిగే వ్యక్తి గుర్తొస్తాడు. ఈ మూవీలో మొదటి నుంచి చివరి వరకు కళ్ళు లేనట్టు నడిచి ఆడియన్స్ సింపతీ పొందాక లాస్ట్ ఎండింగ్ బిట్ లో కళ్ళు తెరిచేసరికి ఒక్కసారి షాక్ అవడం ఆడియన్స్ వంతవుతుంది. అలాంటి మీసాల లక్ష్మణ్ తన గురించి ఎన్నో విషయాలని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. " శ్రీకాకుళం దగ్గర పర్లాకిమిడి దగ్గర ఉండే ఊరు మాది. పదో తరగతి చదివేసాక హైదరాబాద్ వచ్చేసాను ఎందుకొచ్చానో ఎం చేద్దామని వచ్చానో కూడా తెలీదు. చేతిలో డబ్బుల్లేనప్పుడు సిమెంట్ పనికి వెళ్లాను. బిల్డింగ్ వర్క్స్ చేసాను అలాగే ఎఫ్ఎన్సిసిలో అల్లు అర్జున్ గారి ఇంటి పని చేసాను తర్వాత ఎస్వి.కృష్ణారెడ్డి గారి ఇంట్లో కూడా పని చేసాను. మొదట్లో ఎవరింట్లో పని చేస్తున్నామో తెలిసేది కాదు.
ఎప్పుడూ నేను సెలబ్రిటీస్ తో మాట్లాడింది లేదు. కృష్ణారెడ్డి గురువు గారు నన్ను చదువుకోమని చెప్పారు..కానీ నేను చదువుకోలేదు. సర్ నాకు ఈ చదువు ఎక్కదు. ఏదో నాటకాలు, సినిమాల్లో క్యారెక్టర్లు చేసుకుంటే వచ్చే డబ్బులు సరిపోతాయి నను పోరద్దు గురువుగారు అన్నాను..తెర మీద కనిపిస్తే చాలు ఇంకేం అక్కరలేదు అనుకున్నాను..చాల నాటకాల్లో నటించాను " అని చెప్పాను అంటూ తన హిస్టరీ మొత్తం చెప్పాడు. జైలర్ మూవీలో మీసాల లక్ష్మణ్ చెప్పిన డైలాగ్ “వర్త్ వర్మ వర్త్ మనం చేసేది అంతా వర్త్.. కళ్లు చెదిరిపోయాయి, మైండ్ బ్లోయింగ్” ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలుసు.
![]() |
![]() |