![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్ లో ఓజి కూడా ఒకటి. పవన్ బర్త్ డే కానుకగా ఓజి నుంచి హంగ్రీ చీతా అంటూ వచ్చిన చిన్నపాటి టీజర్ అయితే ఒక పెను విధ్వంసమే సృష్టించింది. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ హోదాలో పవన్ కళ్యాణ్ కత్తితో చేసిన విన్యాసాలతో పాటు ఒక పెద్ధ గన్ పట్టుకొని శత్రువులని తుదముట్టించడానికి వెళ్తుంటే ఫ్యాన్స్ పవన్ నామ జాపంతో పూనకాలు వచ్చినవాళ్లలా ఊగిపోయారు. ఇక అప్పటి నుంచి ఓజి కి సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తునే ఉన్నారు. తాజాగా ఓ జి నుంచి వచ్చిన ఒక న్యూస్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తుంది.
న్యూ ఇయర్ సందర్భంగా ఓజి నుంచి ఒక సాంగ్ లేదా పవన్ కళ్యాణ్ గెటప్ కి సంబంధించిన కొత్త పోస్టర్ రిలీజ్ కాబోతుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తు వచ్చారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ డిమాండ్ బాగా పెరిగిపోయేసరికి కొత్త ఏడాది కానుకగా ఓజి నుంచి ఎలాంటి ట్రీట్ ఇవ్వట్లేదంటూ ఆ మూవీ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ హర్ట్ అయిపోతున్నారు. కనీసం పోస్టర్ రిలీజ్ చేసినా బాగుండేదంటు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్ లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీత సారథ్యంలో ఓజి తెరకెక్కుతుంది.
![]() |
![]() |