![]() |
![]() |
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున. ఈ వరస ఒక తరం హీరోలను సూచిస్తుంది. అయితే వీరందరిలో బాలకృష్ణ సీనియర్ అని అందరూ అనుకుంటారు. కానీ, నాగార్జునే మొదట స్క్రీన్‌మీద కనిపించాడని ఎవ్వరికీ తెలీదు. ‘వెలుగునీడలు’ చిత్రంలో నెలల పిల్లాడిగా నాగార్జున కనిపిస్తారు. అయితే నటనపరంగా చూస్తే బాలకృష్ణ వీరిలో సీనియర్. ఆ తర్వాత చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చారు. ఇక నాగార్జున, వెంకటేష్ ఒకే సంవత్సరం 1986లో హీరోలుగా తెరంగేట్రం చేశారు. 1974లో ‘తాతమ్మకల’తో బాలయ్య ఎంట్రీ ఇస్తే.. 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. ఆ రకంగా ఇద్దరి మధ్య నాలుగేళ్ల వ్యత్యాసం ఉంది. ఇక ఈ నలుగరు హీరోలు ఎవరికి వారు స్టార్‌డమ్ క్రియేట్ చేసుకుని ముందకెళ్తున్నారు.
ఇదిలా ఉంటే.. నిర్మాత రామానాయుడుకి చిన్న కుమారుడు ఉన్నాడన్న సంగతి చిరంజీవికి చాలా కాలం తెలియదు. ఈ విషయాన్ని తాజాగా రివీల్ చేసారు. ‘1983లో సురేష్ ప్రొడక్షన్స్‌లో ‘సంఘర్షణ’ అనే సినిమా చేసాను. అప్పుడే నిర్మాణ రంగంలో శిక్షణ పొందుతున్న సురేష్‌బాబు పరిచయం అయ్యారు. రామానాయుడికి రెండో అబ్బాయి కూడా ఉన్నాడని అప్పుడే తెలిసింది. అబ్బాయి ఎలా ఉంటాడని అడిగాను. ఫర్వాలేదు అని చెప్పారు. ఆ తర్వాత ఓ సందర్భంలో వెంకటేష్‌ని చూడడం జరిగింది. అందంగా మెరిసిపోతున్నాడు. అప్పుడు నాకు టెన్షన్ మొదలైంది. సురేష్ ప్రొడక్షన్స్‌లో సినిమా చేయడం అంటే అప్పట్లో నాలాంటి వాళ్లకి ఓ భరోసా...ధీమా లాంటింది. వాళ్ల అబ్బాయి హీరో అయితే నాకు గట్టిపోటీ ఎదురవుతుందని భయపడ్డాను. కానీ తనకు సినిమాలపై ఆసక్తి లేదు అని రామానాయుడు చెప్పాక ఊపరి పీల్చుకున్నాను. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా పరిచయం అయ్యాడు. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి మేం మంచి ఫ్రెండ్స్‌గా మారిపోయాం. సినిమాల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు వెంకటేష్. అందుకే ఎప్పటికప్పుడు విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. వెంకటేష్ నటించిన మల్లీశ్వరి అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాయే చెయ్యాలి అనే నిబంధన పెట్టుకోకుండా అన్ని రకాల సినిమాలు చేయడం అతని ప్రత్యేకత. అతని ప్రయాణం ఇలాగే సంతోషంగా కొనసాగాలని కోరుకుంటున్నాను’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి.
![]() |
![]() |