![]() |
![]() |
.webp)
నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా రూపొందిన ‘డెవిల్’ చిత్రం ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన టాక్ ట్విట్టర్‌లో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. కథ, కథనాల గురించి చెబుతూ సినిమా కాస్త అటూఇటూగా ఉన్నా ఆడియన్స్‌ని ఆకట్టుకునేలాగే ఉందంటున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్ పెర్‌ఫార్మెన్స్ హైలైట్‌గా ఉందట. సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయిందని చెబుతున్నారు. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు ఏమంటున్నారో ఓసారి చూద్దాం.
‘డెవిల్ చాలా బాగుంది. సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి. అవన్నీ ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తాయి. అలాగే కళ్యాణ్‌రామ్ పెర్‌పార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఇది ఒన్ మేన్ షో అని చెప్పొచ్చు. మాస్ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. తప్పకుండా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి’ అని ఓ నెటిజన్ అభిప్రాయపడుతున్నాడు.
‘సెకండాఫ్ చాలా బాగుంది. సినిమాని చాలా ఎంగేజింగ్‌గా డైరెక్టర్ తీసుకెళ్ళాడు. కథను ఎంతో డీసెంట్‌గా రాసుకున్నట్టు కథనాన్ని బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. కళ్యాణ్‌రామ్ నట విశ్వరూపం ఈ సినిమాలో కనిపిస్తుంది’ అని ఓ నెటిజన్ అంటున్నాడు.
‘ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ మీదే నడుస్తుంది. సెకండాఫ్‌లోని ట్విస్టులు చాలా బాగా కుదిరాయి. ఫస్ట్‌హాఫ్ కంటే సెకండాఫ్ చాలా బాగుంది. ఇది తప్పకుండా కమర్షియల్ సినిమా అవుతుంది’ అని ఒకరి అభిప్రాయం.
ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని సెకండాఫ్ అద్భుతంగా ఉందని అంటున్నారు. మొత్తానికి కళ్యాణ్ రామ్ అయితే హిట్టు కొట్టేశాడని చెబుతున్నారు. సినిమా నుంచి ఇంకా చాలా ఆశించామని, కానీ నిరాశ చెందామని మరో నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఎంట్రెన్స్ గట్టిగా ఎక్స్‌పెక్ట్ చేశారట. కానీ అనుకున్న రేంజ్‌లో లేదని చెబుతున్నారు.
ఫస్ట్ హాఫ్ కాస్త నిదానంగా సాగుతుంది.. కొన్ని సీన్లు బోరింగ్‌గా అనిపిస్తాయి.. ఇంటర్వెల్ బాగుంది.. స్క్రీన్ ప్లే బాగా లేదు.. మంచి కథ ఉన్నా తెరపైకి సరిగ్గా తీసుకు రాలేకపోయారు.. డైరెక్టర్ చేంజ్ వల్ల అది జరిగిందేమో అని అనుమానం వ్యక్తం చేశాడు ఓ నెటిజన్.
ఒక్కసారి డెవిల్‌ను చూడొచ్చు.. బాగానే ఉంది.. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులను అస్సలు ఊహించలేం. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటూ ఊహాతీతంగానే సాగుతుందట. హీరోయిన్ కాల్చినప్పుడు హీరో చనిపోయి ఉంటే.. సినిమా ఇంకా బాగా ఉండేదని ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు.
ఇదీ.. సోషల్ మీడియాలో ‘డెవిల్’ సినిమా గురించి వినిపిస్తున్న టాక్. ఒక్కొక్కరు ఒక్కోలా సినిమా గురించి చెబుతున్నారు. కొందరు ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని అంటే, మరికొందరు ఒకసారి చూడదగ్గ సినిమా అంటున్నారు. మరికొందరు సినిమ ఏమీ బాగాలేదు. కథని బాగా హ్యాండిల్ చెయ్యలేకపోయారని చెబుతున్నారు. ఇది తప్పకుండా మంచి కమర్షియల్ సినిమా అవుతుందని మరికొందరి అభిప్రాయం. ఏది ఏమైనా కళ్యాణ్‌రామ్ సినిమాకి ఫస్ట్ షోకి ఇలాంటి టాక్ రావడం వల్ల సినిమాపై హోప్స్ పెట్టుకోవచ్చని సినీ వర్గాలు అంటున్నాయి.
![]() |
![]() |