![]() |
![]() |

హీరో మీద నమ్మకంతో ఒక సినిమాని స్టార్ట్ చేసి ఆ సినిమాకి భారీ స్థాయిలో ఖర్చుపెట్టిన నిర్మాత ఆ తర్వాత హీరోకి ఇవ్వాలసిన రెమ్యునరేషన్ లో 10 శాతం అమౌంట్ తగ్గిస్తేనే చాలా మంది హీరోలు ఒప్పుకోరు. అలాంటిది తన సినిమాకి రెమ్యునరేషన్ నే వదులుకున్న ఒక హీరో ఉన్నాడు.
తమిళ నటుడు శివ కార్తికేయన్ తాజాగా నటిస్తున్న సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రం అయలాన్. ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈ కార్యక్రమంలో శివ కార్తికేయన్ మాట్లాడుతు ఈ సినిమాని ఎన్నో వ్యయప్రయాసలకి ఓర్చి తెరకెక్కించాం. సినిమా బడ్జట్ కూడా కొన్నిఅనుకోని కారణాల వాళ్ళ పెరిగిపోయింది. అందుకే నిర్మాతకి అండగా ఉండాలని నా రెమ్యునరేషన్ ని కూడా వదులుకున్నాను అని చెప్పాడు. అలాగే ఇలాంటి చిత్రాల్లో నటించాలనేది నా చిరకాల కోరిక అని అయలాన్ లో హింసాత్మక సంఘటనలు కానీ అసభ్యకరమైన సన్నివేశాలు కానీ ఉండవని ఇంటిల్లిపాది కలిసి చూసే సినిమాగా ఉంటుందని కూడా శివ కార్తికేయన్ చెప్పాడు.
జనవరి 12 న విడుదల కాబోయే అయలాన్ లో శివ కార్తికేయన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా ఆర్ రవి కుమార్ రచన బాధ్యతలని నిర్వహించాడు. కె జె ఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాటి జయం రాజ్ నిర్మించగా ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించాడు.
![]() |
![]() |