![]() |
![]() |

బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య దిల్ రాజు ప్రొడక్షన్స్ లో నటించే అవకాశం దక్కించుకుందని ఇటీవల న్యూస్ వినిపించిన సంగతి తెలిసిందే. ఈ వార్తను నిజం చేస్తూ తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది.
యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వైష్ణవి.. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేసుకుంటూ.. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో మెరిసింది. 'బేబీ'తో హీరోయిన్ గా మారి మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు, వైష్ణవి నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఇండస్ట్రీ దృష్టి ఆమెపై పడింది. తాజాగా ఆమె దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేసే అవకాశం దక్కించుకుంది.
దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా అరుణ్ అనే నూతన దర్శకుడి డైరెక్షన్ లో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో హీరోయిన్ గా వైష్ణవిని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా వైష్ణవి.. "నాకు ఇష్టమైన జానర్ లో మొదటిసారి నటిస్తుండటం పట్ల ఉత్సాహంగా ఉన్నాను. ఇది తెలుగు సినిమాలో చాలా విభిన్నమైన మరియు ప్రత్యేకమైన పాత్ర." అంటూ ట్వీట్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది. ఇక ఈ సినిమాకి 'లవ్ మీ' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం.
![]() |
![]() |