వార్-2.. హీరో ఎన్టీఆర్.. విలన్ హృతిక్..!
on May 20, 2025
యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతోన్న 'వార్-2'తో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇందులో ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నాడని అందరూ భావించారు. కానీ తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే.. ఇందులో విలన్ హృతిక్ అనిపిస్తోంది. (War 2 Teaser)
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా 'వార్-2' టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ యాక్షన్ ప్రియులను మెప్పించేలా ఉంది. అటు హృతిక్ ఫ్యాన్స్, ఇటు ఎన్టీఆర్ అభిమానులు మెచ్చేలా టీజర్ ను కట్ చేశారు. ఇద్దరు ఎంతో స్టైలిష్ గా ఉన్నారు. ఇద్దరి మధ్య యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయేలా ఉన్నాయి. అయితే టీజర్ ని సరిగ్గా గమనిస్తే.. ఇందులో నెగటివ్ రోల్ లో హృతిక్ కనిపిస్తున్నాడనే అభిప్రాయం కలగకమానదు.
"నా కళ్ళు నిన్ను ఎప్పటినుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్. ఇండియాస్ బెస్ట్ సోల్జర్, 'రా' బెస్ట్ ఏజెంట్ నువ్వే.. కానీ, ఇప్పుడు కాదు." అంటూ ఎన్టీఆర్ చెప్పే వాయిస్ తో వార్-2 టీజర్ ప్రారంభమైంది. ఆ డైలాగ్ ని బట్టి చూస్తే.. ఒకప్పుడు బెస్ట్ సోల్జర్, బెస్ట్ ఏజెంట్ అయిన కబీర్, ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు అని అర్థమవుతోంది. కబీర్ ని పట్టుకోవడానికి వచ్చిన పవర్ ఫుల్ ఏజెంట్ గా ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. దీంతో కబీర్ నెగటివ్ గా ఎందుకు మారిపోయాడు? అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
