అసలు ఎవరీ శర్మిష్టా పనోలి..? పవన్ కళ్యాణ్ ట్వీట్ తో సంచలనం..!
on Jun 2, 2025

ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశం మొత్తం మన సైనిక చర్యకు మద్దతు తెలిపింది. అయితే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం దీనిపై స్పందించలేదు. కొందరైతే నెగటివ్ కామెంట్స్ కూడా చేశారు. దీంతో బాలీవుడ్ స్టార్స్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ముఖ్యంగా శర్మిష్టా పనోలి అనే అమ్మాయి.. బాలీవుడ్ సెలబ్రిటీలను ఘాటుగా విమర్శించింది.
పూణేకు చెందిన శర్మిష్టా పనోలి లా స్టూడెంట్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గానూ రాణిస్తోంది. అయితే ఆమె.. ఆపరేషన్ సిందూర్ పై మౌనంగా ఉన్న బాలీవుడ్ సెలబ్రిటీలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. కానీ, ఆ వీడియో మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉందనే కామెంట్స్ రావడంతో.. శర్మిష్టా పనోలి వీడియో డిలీట్ చేసింది.

శర్మిష్టా పనోలి తన వీడియోని డిలీట్ చేసినప్పటికీ.. ఆమెను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ ని దేశవ్యాప్తంగా పలువురు ఖండిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. శర్మిష్టాకు మద్దతుగా ట్వీట్ చేయడంతో ఈ అంశం చర్చనీయాశంగా మారింది.
"తన వ్యాఖ్యలు కొంతమందికి బాధ కలిగించడంతో.. శర్మిష్టా తన తప్పును అంగీకరించి, ఆ వీడియోను తొలగించి క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ పశ్చిమ బెంగాల్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మరి టీఎంసీ పార్టీకి చెందిన నాయకులు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసి, లక్షలాది మందికి బాధ కలిగించినప్పుడు చర్యలేవి?" అని ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్.. శర్మిష్టాకు తన మద్దతును తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



