పెళ్లి రోజే తండ్రైన హీరో విష్ణు విశాల్
on Apr 22, 2025
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల(Gutta Jwala)ప్రముఖ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal)ఏప్రిల్ 22 ,2021 న వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. రీసెంట్ గా విష్ణు విశాల్ ఎక్స్ వేదికగా తాను తండ్రి అయినట్టుగా పోస్ట్ చేసాడు. మాకు ఆడపిల్ల పుట్టింది ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. మా నాలుగో పెళ్లి రోజు ఆడపిల్ల పుట్టడం మరింత ఆనందంగా ఉంది. ఇది దేవుడు ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నాం. మీ అందరి ప్రేమ ఆశీర్వాదం కావాలంటు ఒక పిక్ ని కూడా షేర్ చేసాడు.
దీంతో పెళ్లి జరిగిన నాలుగు సంవత్సరాలకి, పైగా అదే రోజు పాప పుట్టడం చాలా స్పెషల్ అంటు పలువురు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన విష్ణుకి 2010 లో తమిళ నటుడు నటరాజ్ కూతురు రజిని నటరాజ్ తో వివాహం జరిగింది. కానీ పరస్పర అభిప్రాయబేధాలు తలెత్తడంతో 2018 లో విడాకులు తీసుకున్నారు. అప్పటికే వాళ్లిదరికి ఆర్యన్ అనే కొడుకు ఉన్నాడు. ఇక గుత్తాజ్వాల, విష్ణు విశాల్ కి మాత్రం ఇదే మొదటి సంతానం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
