సిబిఐ ముందుకు హీరో విశాల్..అభిమానుల్లో కలవరం
on Nov 28, 2023
విశాల్ డ్యూయల్ రోల్ లో నటించగా ఇటీవల తమిళ, తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మార్క్ అంథోని. ఈ చిత్రం తమిళనాట హిట్ అవ్వగా తెలుగులో మాత్రం అంతగా ఆడలేదు. విశాల్ సరసన అభినయ, రీతూ వర్మ లు నటించగా ప్రముఖ దర్శకుడు ,నటుడు అయిన ఎస్ జె సూర్య విలన్ గా నటించాడు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఒక విషయం గురించి విశాల్ తన ట్విటర్ వేదికగా చేసిన ఒక పోస్ట్ విశాల్ అభిమానులని షాక్ కి గురి చేస్తుంది.
విశాల్ తన మార్క్ ఆంథోనీ మూవీని హిందీలో కూడా విడుదల చెయ్యాలని భావించి హిందీ సెన్సార్ సర్టిఫికెట్ కోసం అడిగితే తనని సెన్సార్ వాళ్ళు డబ్బులు అడిగారని 6 లక్షలు రూపాయలు చెల్లించారని విశాల్ ఆరోపణ చేసిన విషయం అందరికి తెలిసిందే. విశాల్ చెప్పిన ఈ న్యూస్ భారతీయ చిత్రపరిశ్రమ మొత్తాన్ని షేక్ అయ్యేలా చేసింది. ఇప్పుడు విశాల్ హిందీ చిత్ర సీమకి చెందిన సెన్సార్ వాళ్ళ మీద చేసిన ఆరోపణలకి సంబంధించి సిబిఐ ముందు హాజరవుతున్నాడు. ఈ విషయాన్నే విశాల్ సోషల్ మీడియాలో ప్రస్తావిస్తు నేను నా మార్క్ ఆంథోనీ మూవీ విషయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమకి చెందిన సెన్సార్ వాళ్ళకి లంచం ఇచ్చానని చేసిన ఆరోపణల మీద ముంబై సి బి ఐ ఆఫీస్ కి వెళ్తున్నానని పోస్ట్ చేసాడు.
ఇప్పుడు విశాల్ చేసిన ఆ పోస్ట్ ని చూసిన ఫాన్స్ లో కలవరం మొదలయ్యింది. అలాగే కొంత మంది అభిమానులు అయితే విశాల్ కి అండగా ఉంటామని ఈ కేసు విషయం లో ఆయనతో పాటు ఎంతవరకైనా నడవడానికి సిద్ధం అని కూడా అంటున్నారు.మార్క్ ఆంథోనీ కి విశాల్ నే నిర్మాత.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
