రజనీకాంత్ దారిలో వెంకటేష్..అభిమానులు వింటున్నారా మరి
on Apr 30, 2025
సిల్వర్ స్క్రీన్ పై 'విక్టరీ వెంకటేష్'(venkatesh)కి ఉన్న చరిష్మా గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. మూడున్నర దశాబ్దాలుగా అగ్ర హీరోగా కొనసాగుతు ఎక్కువ శాతం విజయాల్ని అందుకున్నాడు. అందుకే పేరుకి ముందు విక్టరీ వచ్చి చేరింది. రీసెంట్ గా 'సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki vasthunnam)తో సంక్రాంతి విన్నర్ గా నిలవడమే కాకుండా రెండు వందల యాభై కోట్ల రూపాయలని సాధించి సిల్వర్ స్క్రీన్ వద్ద తన స్టామినా ఏ పాటిదో మరోసారి చాటి చెప్పాడు.
రేర్ గా ఇంటర్వ్యూ లు ఇచ్చే వెంకటేష్ రీసెంట్ గా ఒక తమిళ మీడియాతో ముచ్చటించడం జరిగింది. అందులో ఆయన మాట్లాడుతు నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు రజనీకాంత్(Rajini Kanth)గారు నాకోమాట చెప్పారు. మన సినిమా రిలీజ్ సమయంలో థియేటర్ వద్ద మన బ్యానర్ కట్టారా, పోస్టర్లలో మన ముఖం బాగా కనిపిస్తుందా, మాగజైన్లలో మన ఫోటో ఫ్రంట్ పేజ్ లో ఉందా లాంటివిషయాల గురించి ఆలోచించకు. మన పని మనం చేసుకుంటూ వెళ్లాలని చెప్పారు. అప్పట్నుంచి రజనీ గారి సలహానే పాటిస్తు పబ్లిసిటీ గురించి పట్టించుకోను. అసలు దేని గురించి ఆలోచించను. మా నాన్నతో కలిసి రజనీ గారు వర్క్ చేసారు.
నాకు ఆయనకి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. అరుణాచలం అంటే చాలా ఇష్టం. 'రమణ మహర్షి'ని ఆరాధిస్తాను. దేవుడికి సంబంధించిన ఎన్నో పుస్తకాల్ని చదివిన నాకు దేవుడంటే భయం ఉంది. 'ఘర్షణ' మూవీ సమయంలో నేను ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. దేవుడి దయతోనే ఆ ప్రమాదం నుంచి బయటపడ్డానని వెంకటేష్ చెప్పుకొచ్చాడు. ఇక తన నెక్స్ట్ మూవీ గురించి అయితే ఎలాంటి అధికార ప్రకటన లేదు. త్రివిక్రమ్ తో ఉండవచ్చనే గాసిప్ సినీ సర్కిల్స్ లో జోరుగా జరుగుతుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
