వారణాసిలో కాంట్రవర్సియల్ హీరోయిన్! అల్లు అర్జున్ స్టైల్ తెలుసుగా
on Jan 24, 2026
.webp)
-వారణాసిలో ఆ హీరోయిన్ సెట్ అవుతుందా!
-ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి
-రాజమౌళి తో ఎలా ఉంటుంది
-అల్లు అర్జున్ సినిమా ఎంత వరకు వచ్చింది
వరల్డ్ సిల్వర్ స్క్రీన్ ని ఈ సారి చాలా స్ట్రాంగ్ గా వశం చేసుకోవడమే లక్ష్యంగా మహేష్(Mahesh Babu),రాజమౌళి ల 'వారణాసి'(varanasi)ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. కథ, కథనాలు ఎవరి ఊహకి అందని విధంగా ఉండబోతున్నాయి.అందుకు నిదర్శనంగా ప్రచార చిత్రాల్లో మహేష్ తన మెడలో పరమేశ్వరుడిని ఆరాధించే భక్తుడిగా రుద్రాక్షలని ధరించి త్రిశూలం చేత బూని ఉన్నాడు. మరో వైపు రాముడిగా కూడా కనిపించబోతున్నాడు. దీన్ని బట్టే కథ, కథనాలు అంచనా చెయ్యలేని విధంగా ఉన్నాయి. ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ క్యారక్టరయిజేషన్స్ పై కూడా అంచనా వెయ్యని విధంగా ఉండటంతో పాటు ఇంకా ఎవరెవరు వారణాసి లో కనిపించబోతున్నారనే ఆసక్తి అందరిలో ఉంది.
ఈ క్రమంలోనే బాలీవుడ్ మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే వారణాసిలో చేయబోతుందనే రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులోను మహేష్ కి జోడి అనే న్యూస్ ఒక రేంజ్ లోనే చక్కర్లు కొడుతుంది. వారణాసి టీం నుంచి అయితే దీపికా పదుకునే విషయంలో చిన్న క్లూ కూడా రావడంలేదు. మరి ఈ రూమర్ ఎలా సర్క్యులేట్ అవుతుందో తెలియడం లేదు. ఒక వేళ ఆ రూమర్ నిజమైతే ఫ్యాన్స్ కి పండుగే. గత కొన్ని రోజులుగా షూటింగ్ కి సంబంధించిన వర్కింగ్ అవర్స్ విషయంలో దీపికా పదుకునే, సందీప్ రెడ్డి వంగ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. వర్కింగ్ అవర్స్ కి సంబంధించిన విషయంలోనే కల్కి పార్ట్ 2 , స్పిరిట్ నుంచి తప్పించారనే వార్తలు వచ్చాయి.
Also read: మద్యం తాగే ముందు, తాగాక.. ఇలా చేస్తే హెల్త్ సేఫ్
దీంతో దీపికా కాంట్రవర్సి హీరోయిన్ గా మారింది. మరి రాజమౌళి(Ss Rajamouli)సినిమా అంటే వర్కింగ్ అవర్స్ ఏ విధంగా ఉంటాయో తెలిసిందే. ప్రతి ఆర్టిస్ట్ తనతో పాటే ట్రావెల్ చెయ్యాలి. మరి ఈ లెక్కన దీపికా వారణాసిలో ఉండే అవకాశం లేదనే టాక్ కూడా జనరేట్ అవుతుంది. దీపికా పదుకునే ప్రస్తుతం అల్లు అర్జున్(Allu Arjun),అట్లీ(Atlee)కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై కూడా అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



